ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(cm jagan).. ఈ నెల 19న పోలవరం ప్రాజెక్టును (polavaram project) సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస చర్యలపై అధికారులతో సమీక్షిస్తారు.
బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో పోలవరానికి బయలుదేరతారు. ఉదయం 11 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యామ్ (cofferdam), తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ప్రాజెక్టు ప్రగతిపై సమీక్షిస్తారు. నిర్వాసితులకు అందించాల్సిన పరిహారం, సహాయక చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
ముందుగా ముఖ్యమంత్రి జగన్ (cm jagan) ఈ నెల 14న.. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలనుకున్నారు. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా పర్యటన వాయిదా పడింది. ఫలితంగా సీఎం జగన్.. ఈ నెల 19న పోలవరంలో పర్యటించనున్నారు.
ఇదీచూడండి: Chandrababu: 'పూర్తిగా అధ్యయనం చేశాకే గెజిట్‌పై స్పందిస్తా'