CM Jagan to visit Delhi: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయంలో ప్రధాని నరేంద్రమోదీతో .. జగన్ భేటీ కానున్నారు. కొత్త జిల్లాలు, రాష్ట్రానికి నిధుల విషయంపై ప్రధానితో చర్చించనున్నారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపైనా మాట్లాడనున్నారు. అంశాలపై ప్రధానికి విజ్ఞాపనలు అందజేయనున్నారు. ప్రధానితో భేటీ తర్వాత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కోసం సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరారు.
ఇదీ చదవండి: కేంద్రంపై మరోసారి కేటీఆర్ సెటైర్... టార్చర్ పెట్టడంలో కొత్త రికార్డు సృష్టిస్తుందంటూ...