ETV Bharat / city

AP CM JAGAN ON ATTACKS: 'అభిమానులకు బీపీ వచ్చింది.. రియాక్ట్ అయ్యారు'

వైకాపా సర్కారుపై.. ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్(cm jagan) మండిపడ్డారు. దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అలా మాట్లాడలేదన్నారు. టీవీల్లో బూతులు విని భరించలేని అభిమానులకు బీపీ వచ్చి స్పందిస్తున్నారని అన్నారు. కులాలు, మతాల మధ్య విపక్షం చిచ్చు పెడుతోందన్నారు. కావాలనే వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా లబ్ధిపొందాలనే ఆరాటం మన రాష్ట్రంలో కనిపిస్తోందని ధ్వజమెత్తారు.

AP CM JAGAN ON ATTACKS
AP CM JAGAN ON ATTACKS
author img

By

Published : Oct 20, 2021, 3:10 PM IST

AP CM JAGAN ON ATTACKS

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడలేదు. దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారు. తిట్లు విని భరించలేని అభిమానులు స్పందిస్తున్నారు. కావాలని తిట్టించి వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. వైషమ్యాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకుంటున్నారు. -వైఎస్ జగన్, ఏపీ సీఎం

వైకాపా సర్కార్‌పై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని.. అందుకే దారుణమైన పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ‘జగనన్న తోడు’ వడ్డీ చెల్లింపు కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అలా మాట్లాడలేదన్నారు. టీవీల్లో బూతులు విని భరించలేని అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. కులాలు, మతాల మధ్య విపక్షం చిచ్చు పెడుతోందన్నారు. కావాలనే వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా లబ్ధిపొందాలనే ఆరాటం రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జగన్‌ విమర్శించారు. వ్యవస్థలను పూర్తిగా మేనేజ్‌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కోర్టు కేసులు వేయిస్తున్నారని విమర్శించారు. రెండున్నర ఏళ్లలో అందరినీ సంతృప్తి పరిచేలా పాలన చేశానని.. ఇకపైనా అలాగే కొనసాగిస్తానని జగన్‌ వివరించారు.

పారదర్శకంగా పథకాల అమలు

చిరు వ్యాపారులపై వడ్డీ భారం పడకుండా వాళ్ల కాళ్లపై వారు నిలబడేందుకే ‘జగనన్న తోడు’ కార్యక్రమం తీసుకొచ్చాం. రు. 9,50,458 మందికి రూ. 905 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీని విడుదల చేస్తున్నాం. ఏడాదిలో రెండు సార్లు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించాం. ఇకపై ఏటా జూన్‌, డిసెంబర్లలో వడ్డీల చెల్లింపు, కొత్త రుణాలు ఇస్తాం. రుణాలు చెల్లింపుల్లో బకాయిలు ఉన్నవారు డిసెంబర్ నాటికి చెల్లించాలి. దీనిపై సందేహాల నివృత్తికి 08912890525 నెంబరుకు ఫోన్ చేయొచ్చు. పార్టీలకు అతీతంగా పారదర్శకంగా పథకాలను అమలు చేస్తున్నాం - వైఎస్ జగన్, ఏపీ సీఎం

ఇదీ చదవండి: Tdp Leaders Arrest News: ఆంధ్రాలో టెన్షన్ టెన్షన్... తెదేపా నేతల నిర్బంధం... నిరసనలు.. అరెస్టులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.