కాకినాడ డీఆర్సీ సమావేశంలో వైకాపా నేతల పంచాయతీ తాడేపల్లికి చేరింది. నేతల గొడవపై ఏపీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎంపీ సుభాష్ చంద్రబోస్ పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకోవటంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇద్దరు నేతలు తనను కలవాలని సీఎం సమాచారం అందించారు. ముఖ్యమంత్రి పిలుపుతో ఇద్దరు నేతలు తాడేపల్లికి చేరుకున్నారు. వారిద్దరితో సమావేశమైన సీఎం జగన్.. సమావేశంలో రచ్చపై వివరణ తీసుకున్నారు.
సంబంధిత కథనం: డీఆర్సీ సమావేశంలో రసాభాస... వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే వాగ్వాదం