ETV Bharat / city

ap CM Jagan: 'వర్షాలు తగ్గగానే రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి'

ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి... రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వర్షాలు తగ్గాక ముందుగా రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ap CM Jagan: 'వర్షాలు తగ్గగానే రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి'
ap CM Jagan: 'వర్షాలు తగ్గగానే రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి'
author img

By

Published : Sep 6, 2021, 10:11 PM IST

వర్షాలు తగ్గాక ముందుగా రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. అక్టోబరు నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని.. ముందుగా రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగు చేయాలన్నారు.

వర్షాల వల్ల రహదారులు బాగా దెబ్బతిన్నాయని జగన్​ పేర్కొన్నారు. రోడ్ల బాగు కోసం ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసిందని వెల్లడించారు. రోడ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే చాలా వరకు టెండర్లు పిలిచారని.. ఎక్కడైనా ఇంకా పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. అక్టోబరులో రోడ్ల పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా రోడ్ల పనులు చేయాలన్న ముఖ్యమంత్రి.. సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కార్యాచరణ వేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

'వర్షాలు తగ్గాక.. ముందుగా రోడ్ల మరమ్మతుపై దృష్టి పెట్టాలి. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లు అన్నింటినీ బాగు చేయాలి. వర్షాల వల్ల రహదారులు బాగా దెబ్బతిన్నాయి. రోడ్లు బాగు చేసేందుకు ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసింది. రోడ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే చాలా వరకు టెండర్లు పిలిచారు. ఎక్కడైనా ఇంకా పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవాలి. అక్టోబరులో రోడ్ల పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోండి' - జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి

ఇదీ చూడండి: గెజిట్‌ అమలుకు సహకరిస్తాం... కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రికి తెలిపిన సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.