ETV Bharat / city

ఇడుపులపాయలో వైఎస్​కు నివాళులు.. పలకరించుకోని జగన్​, షర్మిల - latest news in ap

JAGAN TRIBUTES: దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి జయంతి సందర్భంగా ఏపీలోని ఇడుపులపాయలో గల ఆయన సమాధి​ వద్ద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ నివాళులర్పించారు. కుటుంబసభ్యులు ఆయనకు అంజలి ఘటించారు. ఇదిలా ఉండగా కార్యక్రమంలో పాల్గొన్న జగన్​, షర్మిల ఒకరినొకరు పలకరించుకోలేదు.

ఇడుపులపాయలో వైఎస్​కు నివాళులు.. పలకరించుకోని జగన్​, షర్మిల

author img

By

Published : Jul 8, 2022, 12:57 PM IST

Updated : Jul 8, 2022, 1:39 PM IST

ఇడుపులపాయలో వైఎస్​కు నివాళులు.. పలకరించుకోని జగన్​, షర్మిల

JAGAN TRIBUTES: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్‌ నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు భార్య భారతితో కలిసి వచ్చిన ఆయన.. తన తండ్రి సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఘాట్​ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్​ సోదరి షర్మిల, తల్లి విజయమ్మతో కలిసి వచ్చి.. తండ్రికి అంజలి ఘటించారు.

జిల్లాలో రెండ్రోజుల పర్యటనను ముగించుకున్న జగన్‌.. ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్‌లో కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నివాళులు అర్పించక ముందు.. ఆ తర్వాత కానీ.. జగన్‌, షర్మిల ఒకరినొకరు పలకరించుకోలేదు. కార్యక్రమం పూర్తైన తర్వాత ఎవరికి వారు ఘాట్‌ నుంచి వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

'దేశానికి రాహుల్​ను ప్రధానిని చేసినప్పుడే వైఎస్సార్​ ఆత్మకు శాంతి..'

ప్రమాదాలకు అడ్డాగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి

Last Updated : Jul 8, 2022, 1:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.