ETV Bharat / city

'ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల ఆర్థిక సాయం ' - news on godavari floods

గోదావరి వరద ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సహాయక చర్యల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని సీఎం అన్నారు.

'ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల ఆర్థిక సాయం '

author img

By

Published : Aug 18, 2020, 5:34 PM IST

ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల అధికారులతో ఏపీ సీఎం జగన్​ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గోదావరి వరద పరిస్థితులపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులంతా సహాయ, పునరావాస పనులు నిర్వహిస్తున్నారని.. ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తానని సీఎం జగన్‌ తెలిపారు.

ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. సహాయక చర్యల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. మరో మూడ్రోజుల్లో క్రమంగా వరద తగ్గుతుంది సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. వరద తగ్గగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, సమాచార వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలని సీఎం సూచించారు.

ఇదీ చదవండి: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. వరద ముంచెత్తుతోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.