ETV Bharat / city

వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు తగిలింది: జగన్‌ - కొవిడ్ వ్యాక్సినేషన్​కు ఎన్నికలతో సమస్య న్యూస్

ఏపీలో వ్యాక్సినేషన్ పంపిణీకి ఎన్నికల ప్రక్రియ అడ్డు తగిలిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి అయిపోయి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్​ ముగిసిన అనంతరం కొద్దిసేపు అధికారులతో భేటీ అయిన సీఎం.. పరిషత్ ఎన్నికల్లో మిగిలిన ఆరు రోజుల ప్రక్రియను కూడా నిర్వహించేందుకు ప్రయత్నించాలని సూచించారు.

వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు తగిలింది: జగన్‌

author img

By

Published : Mar 17, 2021, 7:38 PM IST

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డుగా నిలిచాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి వ్యాఖ్యానించారు. పరిషత్ ఎన్నికలు కూడా ముగిసిపోతే వ్యాక్సినేషన్​పై దృష్టి సారించేందుకు వీలుకలిగేదని ఆయన అధికారులతో అన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్​ అనంతరం అధికారులతో కొద్దిసేపు భేటీ అయిన జగన్​... ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో మునిగిపోయిందని జగన్ అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియలో ఇక ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవికూడా జరిగిపోయి ఉంటే బాగుండేదని.. ఏవో కారణాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చిందని వ్యాఖ్యానించారు.

త్వరగా ముగించాలి..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మిగిలిపోయిన కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియ పూర్తైతే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని అధికారులతో అన్నారు. వైరస్‌ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ చేయడం, ఆయా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం కష్టం అవుతాయని స్పష్టం చేశారు.

గవర్నర్‌, హైకోర్టుకు నివేదించాలి..

మిగిలిపోయిన ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి అధికారులు ప్రయత్నించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం తరఫున అధికారికంగా గవర్నర్‌కు, హైకోర్టుకు నివేదించాలని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో మిగిలిపోయిన ఆ 6 రోజుల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

పరీక్షల సంఖ్య పెంచాలి

వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతంగా చేపట్టే కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలని జగన్​ సూచించారు. వైరస్‌ సోకినవారికి చికిత్స అందించడం కన్నా... ఆ వైరస్‌ రాకుండా నివారణ పద్ధతులపై దృష్టిపెట్టాలన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరీక్షల సంఖ్య పెంచాలని.. నూరుశాతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరిగేలా చూడాలని సీఎం అన్నారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.