AP CM Jagan:సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. రాష్ట్రం శ్రీలంకలా అవుతుందంటూ విమర్శలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. నరసరావుపేటలో వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతిఒక్కరి.. ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ సంక్షేమం అందాలని సీఎం జగన్ అన్నారు. దేశం మొత్తం మనవైపు చూసేలా గొప్ప వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. సేవాభావంతో వాలంటీర్లు పనిచేస్తున్నారని అన్నారు. పేదల కళ్లలో సంతోషం చూడటమే ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
CM Jagan: రాష్ట్రంలో 2 లక్షల 60 వేలమంది మహాసైన్యం ఉందన్నారు సీఎం జగన్. వాలంటీర్ల సేవా భావానికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. అన్నిరకాల సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలు ఉపయోగపడుతున్నాయని కొనియాడారు. లంచాలు, వివక్షకు తావులేకుండా తీసుకొచ్చిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అన్నారు. సేవే పరమావధిగా మన వాలంటీర్లు పని చేస్తున్నారని చెప్పారు. సచివాలయాల సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికీ 33 పథకాలు నేరుగా అందుతున్నాయని పేర్కొన్నారు. వాలంటీర్లు అంటే స్వచ్ఛంద సేవకులని... అందుకే వారి సేవలకు గుర్తింపుగా పురస్కారాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఇవాళ్టి నుంచి 20 రోజులపాటు వాలంటీర్లకు సన్మానాలు కొనసాగుతాయని ప్రకటించారు.
ఇదీ చదవండి: ministers venue: కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.. వేదికపై ప్రభుత్వం కసరత్తు