ETV Bharat / city

సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పనితీరుపై ఏపీ సీఎం ప్రశంసలు - సీఎం జగన్ న్యూస్

నేటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పనితీరును ఏపీ సీఎం జగన్ చప్పట్లు కొట్టి ప్రశంసించారు. వారి సేవలకు గుర్తింపుగా ప్రతిఒక్కరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లతో ఉత్సాహపరచాలని పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల శ్రమకు గుర్తింపుగా చప్పట్లు కొట్టి సీఎం సంఘీభావాన్ని తెలిపారు. సీఎం పిలుపు మేరకు పలు జిల్లాలో మంత్రులు చప్పట్లతో సచివాలయ సిబ్బందిని అభినందించారు.

cm-jagan-appreciate-grama-sachivalaya-staff
సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పనితీరుపై ఏపీ సీఎం ప్రశంసలు
author img

By

Published : Oct 2, 2020, 10:26 PM IST

ఆంధ్రప్రదేశ్​ గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తైన సందర్భంగా..సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ కరతాళధ్వనులతో అభినందించారు. మహాత్మాగాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం సాధ్యం చేసేందుకు గతేడాది ఇదే రోజున ప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ విజయవంతమైనట్లు సీఎం స్పష్టం చేశారు.

అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఇంటికి వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా అందిస్తున్నట్లు సీఎం వివరించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలందిస్తోన్న గ్రామ సచివాలయ వ్యవస్థను సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి జగన్‌ చప్పట్లతో వారిని అభినందించారు.

గ్రామస్వరాజ్యం తీసుకువచ్చేందుకే...

గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం తీసుకువచ్చేందుకు సచివాలయ వ్యవస్థ ఎంతో తోడ్పడుతోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా... విశాఖలో మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్ వినయ్ చంద్, ఇతర ఉన్నతాధికారులు చప్పట్లతో ప్రశంసించారు.

పారదర్శక పాలన కోసం...

ప్రభుత్వ పథకాలను ప్రజలకు పారదర్శకంగా అందించడంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాత్ర కీలకమని హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరులో అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందిస్తున్న సేవలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు వద్దకు తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందన్నారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ సచివాలయ సిబ్బందిని ఘనంగా సత్కరించారు.

వారి సేవలు వెలకట్టలేనివి...

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని మంత్రి శంకరనారాయణ కొనియాడారు. అనంతపురం జిల్లా పెనుకొండలోని మంత్రి నివాసం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కరతాళధ్వనులతో గ్రామ వాలంటీర్లను అభినందించారు.

ఇదీ చదవండి : స్కూల్​ ఫీజులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: శివబాలాజీ, మధుమిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.