schools reopen in Assam: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొన్ని రాష్ట్రాలు కరోనా ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను ఫిబ్రవరి 15న పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.
అసోంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో 2022 జనవరి 25 నుంచి పాఠశాలల్లో 8వ తరగతి వరకు భౌతిక తరగతులను నిలిపివేశారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరి 15న పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుందని హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
మరో రెండు నుంచి మూడు రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య 1000కంటే తక్కువకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రోజువారీ కేసుల సంఖ్య 1000కంటే తగ్గితే రాత్రి కర్ఫ్యూ లో సడలింపులు ఉంటాయని.. పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తామని అసోం ముఖ్యమంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. ఒక్క రోజే 1,733 మరణాలు