ETV Bharat / city

జూన్​ 1, 2 తేదీల్లో రాష్ట్ర స్థాయి చింతన్​ శిబిర్‌: భట్టి విక్రమార్క - telangana varthalu

CLP Leader Bhatti Vikramarka: కీసరలో జూన్‌ 1, 2 తేదీల్లో రాష్ట్ర స్థాయి చింతన్​ శిబిర్‌ నిర్వహిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. సోనియాగాంధీ ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేర్చేందుకు కృషి చేస్తామని భట్టి తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు దాడి చేశారని ఆరోపిస్తున్న మంత్రి మల్లారెడ్డి.. ఆధారాలు ఉంటే బయటపెట్టకుండా ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించారు.

జూన్​ 1, 2 తేదీల్లో రాష్ట్ర స్థాయి చింతన్​ శిబిర్‌: భట్టి విక్రమార్క

author img

By

Published : May 30, 2022, 3:35 PM IST

CLP Leader Bhatti Vikramarka: మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కీసరలో జూన్‌ 1, 2 తేదీల్లో రాష్ట్ర స్థాయి చింతన్​ శిబిర్‌ నిర్వహిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి చింతన్​ శిబిర్‌లో వివిధ అంశాలను చర్చించేందుకు 6గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని భట్టి తెలిపారు. రాష్ట్ర స్థాయి చింతన్ శిబిర్‌లో చర్చించి తీసుకున్న నిర్ణయాలను రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం బలోపేతం, సామాజిక న్యాయాలపై చర్చ ఉంటుందన్నారు. ఆర్థిక వ్యత్యాసాలతో పాటు సామాజిక అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.

సోనియాగాంధీ ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేర్చేందుకు కృషి చేస్తామని భట్టి తెలిపారు. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాలను చర్చించమని... ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చ ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా తనపై కాంగ్రెస్‌ నేతలు దాడి చేశారని ఆరోపిస్తున్న మంత్రి మల్లారెడ్డి ఆధారాలు ఉంటే బయటపెట్టకుండా ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించారు.

"భవిష్యత్​లో కాంగ్రెస్​ పార్టీ పక్షాన ఈ రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్లడానికి చింతన్​ శిబిర్​ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. జూన్​ 1,2 తేదీల్లో రాష్ట్రంలోని అందరు ముఖ్యనేతలను పిలిచి వారి అభిప్రాయాలను సేకరించి.. అంతిమంగా క్రోడీకరించి కాంగ్రెస్​ పార్టీ పాలసీని తయారు చేయబోతున్నాం." -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

జూన్​ 1, 2 తేదీల్లో రాష్ట్ర స్థాయి చింతన్​ శిబిర్‌: భట్టి విక్రమార్క

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.