దళితబంధు విషయంలో తెరాస, భాజపాలు కపట నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు భాజపా వ్యతిరేకమన్న భట్టి(CLP Leader Bhatti Vikramarka)..... అందుకే ఆ పార్టీ నిర్ణయాలు అలాగే ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని సూచించారు. హుజూరాబాద్ ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి భాజపా, తెరాసలకు బుద్దిచెప్పాలని భట్టి(CLP Leader Bhatti Vikramarka) పిలుపునిచ్చారు.
ఇంతకుముందే.. జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి కేటీఆర్(Telangana Minister KTR0.. కాంగ్రెస్లో భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. కానీ పార్టీలో ఆయన చెప్పేదేం నడవడం లేదన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్, భాజపా ఒక్కటయ్యాయని.. త్వరలో ఈటల, వివేక్ కాంగ్రెస్లో చేరే సూచనలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడిన కాసేపటికే.. తెరాస, భాజపాలు కపట నాటకాలు ఆడుతున్నాయని భట్టి(CLP Leader Bhatti Vikramarka) వ్యాఖ్యానించడం గమనార్హం.