రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో రాష్ట్రాల్లోని గ్రామాలకు ఎన్నో ఆశలు రేకెత్తించి... ఇప్పుడు వాటిని విస్మరించిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఒత్తిడితో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు అప్పులపాలవుతున్నారని భట్టి పేర్కొన్నారు.
హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్వర్యంలో చేపట్టిన సత్యగ్రహ దీక్షలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను తెరాస ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. స్థానిక సంస్థల ప్రతిష్ఠ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.