రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని సీఎల్పీ భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని అన్నారు. ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈనెల 19 నుంచి జిల్లా కేంద్రాల్లో ఆస్పత్రులను సందర్శిస్తానని తెలిపారు. పార్టీని వీడుతున్నట్లు తనకు ఎంపీ టికెట్ రాకుండా కొందరు అడ్డుకున్నారని వీహెచ్ చేసిన విమర్శలపై భట్టి స్పందించారు. టికెట్ల నిర్ణయం రాష్ట్ర స్థాయిలో జరగదని.. ఏఐసీసీ ఎన్నికల కమిటీ చూసుకుంటుందని వివరించారు. కొప్పుల రాజును బద్నాం చేయడానికి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
ఇదీ చూడండి: చల్లా మల్లారెడ్డి దశదినకర్మకు హాజరైన కేసీఆర్