ETV Bharat / city

టీపీసీసీ అధ్యక్షుని నియామకంపై 9న స్పష్టత! - టీపీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్ రాజీనామా

టీపీసీసీ అధ్యక్ష పదవిపై డిసెంబరు 9న స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ 2స్థానాలకే పరిమితమవ్వడం, ఓట్ల శాతం పడిపోవడంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం విదితమే.

Clarity on the appointment of TPCC President on December 9th!
టీపీసీసీ అధ్యక్షుని నియామకంపై 9న స్పష్టత!
author img

By

Published : Dec 6, 2020, 6:47 AM IST

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా లేఖ ఏఐసీసీకి చేరింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 7న గోవా నుంచి దిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం ఉత్తమ్‌ రాజీనామా లేఖను ఆమెకు అందజేయనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ తెలిపారు. తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ 8న హైదరాబాద్‌కు చేరుకొని ముఖ్య నేతలతో సమావేశమవుతారు. డిసెంబరు 9న సోనియా జన్మదినం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రోజు కావడంతో అదేరోజు పీసీసీ అధ్యక్షుని ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసినప్పుడు.. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఉత్తమ్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం తీరును నిరసిస్తూ 23 మంది సీనియర్‌ నేతలు లేఖాస్త్రం సంధించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జులను మార్చినపుడు ఇక్కడా మార్పు ఉంటుందని అంతా భావించారు. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాను తొలిగించి మాణిక్కం ఠాగూర్‌ని నియమించిన అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుని మాత్రం మార్చలేదు. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోవడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీస పోటీని ఇవ్వకపోవడంతో అధ్యక్షుని మార్పు తథ్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష రేసులో ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పేర్లు ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.