AP High court Additional Building : ఏపీ హైకోర్టు అదనపు భవనానికి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఉదయం 9.50 నిమిషాలకు ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు, బార్ అసోయేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఉన్న భవనం పూర్తి స్థాయి కోర్టు విధుల నిర్వహణకు సరిపోకపోవడంతో హైకోర్టు ఎదురుగా అదనపు భవనం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. అదనపు భవనాన్ని జీ+5 సామర్ధ్యంతో నిర్మించనున్నారు. నిర్మాణ ప్రణాళిక, ఇతర అంశాలను ఉన్నతాధికారులు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతరులకు వివరించారు.
- ఇదీ చదవండి : 10 నెలల జైలు జీవితం గడిపి.. స్వదేశానికి రైతులు