వానాకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఫిర్యాదుల కోసం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా... గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణలో నాణ్యత, తేమ పేరిట కొర్రీలు, తూకం, గన్నీ బ్యాగులు, మౌలిక సదుపాయాలు, ధాన్యం గోదాములకు తరలింపు జాప్యం, రవాణా, కనీస మద్దతు ధరల చెల్లింపు వంటి ఇతర అంశాలపై ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా టోల్ ఫ్రీ నంబర్లు: 1967, 180042500333, 18004254614 కు ఫిర్యాదు చేయాలని సూచించింది.
ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించనున్నామని, తక్షణమే స్పందించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ప్రకటించారు. ఇప్పటికే కోతలు, నూర్పిడి పూర్తైన ధాన్యం మార్కెట్‌కు వస్తున్నందున... కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనట్లైతే... రైతులు నేరుగా ఆయా నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: ముంబయి ఐఐటీ విద్యార్థులతో.. చంద్రబాబు 'విజన్'!