Cinema ticket prices hike in AP: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సినిమా హాళ్లలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సినీరంగ ప్రముఖులతో జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
- అన్ని థియేటర్లలో నాన్ ప్రీమియం సీట్లు 25% వరకు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మల్టీప్లెక్సుల విషయంలో నాన్ ప్రీమియం సీట్లపై స్పష్టత లేదు.
- చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదన్న చర్చ జరిగింది. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను చిరంజీవి, రాజమౌళిలకు ముఖ్యమంత్రి అప్పగించినట్లు తెలిసింది.
ఎలా పెరిగాయంటే...
ఇంతకుముందు సినిమా టికెట్ల ధరలు నిర్ణయించిన జీవోలో ప్రతి కేటగిరీలో మూడు తరగతులు నిర్ణయించారు. ఎకానమీ, డీలక్సు, ప్రీమియంగా విభజించి టికెట్ల ధరలపై ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఎలా అమలు చేయనున్నారు, ఈ తరగతులు మారతాయన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: ‘థ్యాంక్యూ సీఎం’ అంటూ స్టార్ల ట్వీట్‌లు.. ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు