closure of theatres in ap: ఏపీలోని థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో ప్రభుత్వం చర్చలు జరిపింది. సచివాలయంలోని 5వ బ్లాక్‌లో సుమారు గంటన్నర పాటు సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో తనిఖీపైస ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చర్చించారు.
'సినిమా టికెట్ల ధరలు పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు. టికెట్ల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పాం. హైకోర్టు సూచనల మేరకు ధరలపై నిన్ననే ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ త్వరలో రివ్యూ చేసి సమగ్ర నివేదిక ఇస్తుందని చెప్పాం. వివిధ సంఘాల విజ్ఞప్తులు కమిటీ పరిగణలోకి తీసుకుంటుంది. తక్కువ ధరలో ప్రజలకు వినోదం ఎలా ఇవ్వచ్చో కమిటీ పరిశీలిస్తుంది. సామాన్యులు ఇబ్బందులు పడకుండా సమస్యకు పరిష్కారం.'
- పేర్ని నాని, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి.
మాకు ఎవరిపైనా కక్ష లేదు..
జగన్ ప్రభుత్వం కక్షసాధింపుతో థియేటర్లు మూసేస్తుందని ఆరోపించటం సరికాదని మంత్రి నాని అన్నారు. లైసెన్సులు లేకుండా నడుపుతున్న వారిపైనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్షలేదని స్పష్టం చేశారు.
'సెప్టెంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సమావేశమయ్యాం. ఫైర్ విభాగం నుంచి ఎన్‌వోసీ, రెవెన్యూ నుంచి బీ-ఫారం తెచ్చుకోవాలని సమావేశంలో చెప్పాం. లైసెన్సులు లేకుండా నడుపుతున్న వారిపైనే చర్యలు తీసుకున్నాం. మాకు ఎవరిపైనా కక్ష లేదు. చిత్తూరులో 24 థియేటర్లను సీజ్ చేశాం. ఇప్పటివరకు 9 జిల్లాలో 130 థియేటర్లను మూసేశాం. స్వచ్ఛందంగా థియేటర్లు ఎవరూ మూయలేదు. తనిఖీలు చేస్తుంటే పట్టుబడతామని థియేటర్లు మూసుకున్నారు. ఇప్పటివరకు 25 థియేటర్లపై జరిమానా వేశాం.'
- పేర్ని నాని, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి.
సిద్దార్థ్ వ్యాఖ్యలు స్టాలిన్ గురించి కావచ్చు..
perni nani on heros comments: హీరో సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి కావచ్చని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. సిద్దార్థ్ చెన్నైలో ఉంటారని.. ఏపీ మంత్రుల హీరో సిద్దార్థ్ చూశారా ? అని ప్రశ్నించారు.
'హీరో సిద్దార్థ్ చెన్నైలో ఉంటారు. సిద్దార్థ్ వ్యాఖ్యలు స్టాలిన్ గురించి కావచ్చు. ఆయన మమ్మల్ని, మా విలాసాలను ఎప్పుడైనా చూశారా?. హీరో సిద్దార్థ్ పన్నులన్నీ కట్టేది చెన్నైలోనే. చెన్నైలో ఉండే సిద్దార్థ్ ఏపీ గురించి ఎలా మాట్లాడతారు. ఏ కిరాణా కొట్టు కలెక్షన్లు చూసి హీరో నాని మాట్లాడారో తెలియదు.
- పేర్ని నాని, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి.
సీఎం జగన్ ఎవరితోనైనా చర్చకు సిద్ధం..
perni nani on online ticketing: సినీ పరిశ్రమపై ఎవరితోనైనా చర్చకు సీఎం జగన్ సిద్ధమని మంత్రి పేర్ని నాని అన్నారు. సినీ పరిశ్రమపై సూచనలు, సలహాలు స్వాగతిస్తామన్నారు. కొత్త సినిమా రాయితీలపై రాగద్వేషాలు ఏమీ ఉండవని వెల్లడించారు. చట్టం, నిబంధనలు ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. త్వరలో ఆన్‌లైన్ టికెటింగ్ తీసుకొస్తామని తెలిపారు. ఆన్‌లైన్ టికెటింగ్ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి నాని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: