ETV Bharat / city

చంద్రబాబు పేరు చెబితే వదిలేస్తామన్నారు : దేవినేని ఉమ - దేవినేని ఉమా కేసులో ముగిసిన సీఐడీ విచారణ

ఏపీ తెదేపా నేత దేవినేని ఉమ కేసులో సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సీఐడీ అధికారులు ఉమను విచారించారు. చంద్రబాబు పేరు చెబితే తనను వదిలేస్తానని అధికారులు చెప్పారని దేవినేని వివరించారు.

devineni uma
సీఐడీ విచారణలో దేవినేని ఉమ
author img

By

Published : Apr 30, 2021, 6:48 AM IST

‘మీపై నమోదు చేసిన కేసు విషయంలో చంద్రబాబు పేరు చెప్పండి. ఆయన పేరు చెబితే మిమ్మల్ని మధ్యాహ్నానికే వదిలేస్తాం’ అంటూ సీఐడీ అధికారులు తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు, తెదేపా ఆదేశాల మేరకే విలేకర్ల సమావేశంలో వీడియో ప్రదర్శించానని చెప్పాలంటూ ఒత్తిడి చేశారన్నారు. తన ఫోను, ట్యాబ్‌ను శుక్రవారం ఉదయం 9 గంటలకు సీఐడీ కార్యాలయంలో స్వయంగా అందజేయాలని సూచించారని, శనివారం ఉదయం 10 గంటలకు మళ్లీ విచారణకు రావాలని చెప్పారని అన్నారు. తాను చెప్పని విషయాలు కూడా చెప్పినట్లు.. దర్యాప్తు అధికారులు వారికి ఇష్టమొచ్చినట్లు స్టేట్‌మెంట్లు రాసుకుని వాటిపై సంతకాలు చేయాలంటూ బెదిరించారన్నారు.

తెదేపా సీనియర్‌ నేతలు నారా లోకేశ్‌, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, యనమల రామకృష్ణుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితరులనూ విచారణకు తీసుకొస్తామంటూ అక్కడి వారు మాట్లాడుతున్నారని వివరించారు. ఈ నెల 7న తిరుపతిలో దేవినేని ఉమామహేశ్వరరావు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో.. తిరుపతి రావటానికి ఎవరు ఇష్టపడతారని జగన్‌ గతంలో వ్యాఖ్యానించినట్లు ఉన్న ఫోర్జరీ వీడియోను ప్రదర్శించారని, ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజల్ని పక్కదారి పట్టించాలన్న దురుద్దేశంతోనే దీన్ని ప్రదర్శించారన్న ఫిర్యాదుపై ఈ నెల 7న సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం ఆయన సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో దాదాపు 9 గంటల పాటు ఆయన్ను దర్యాప్తు అధికారులు విచారించారు. ఉదయం 10.40 గంటలకు సీఐడీ ప్రధాన కార్యాలయం లోపలికి వెళ్లిన ఆయన రాత్రి 8.30 గంటలకు బయటకొచ్చారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

తప్పుడు కేసులతో గొంతు నొక్కాలనుకుంటున్నారు
‘తప్పుడు కేసులతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నా గొంతు నొక్కాలనుకుంటున్నారు. అక్రమ కేసులకు నేను భయపడను. జగన్‌ చట్టాన్ని తన చుట్టంగా చేసుకున్నారు. 22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నాపై తప్పుడు కేసులు పెట్టి గొంతు నొక్కలేరు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ విచారణకు హాజరయ్యాను. నన్ను రాజమహేంద్రవరం జైలులో పెట్టినా, చంపినా ప్రశ్నిస్తూనే ఉంటా... పోరాడుతూనే ఉంటా. ఇటీవల ధూళిపాళ్ల నరేంద్రను రాజమహేంద్రవరం జైలుకు పంపించినట్లే నన్ను సీఐడీ కార్యాలయంలో 9 గంటల పాటు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారు. ప్రజాబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న ఓ వీడియోను ప్రదర్శించటం నేరమా? కర్నూలులో ఫిర్యాదు ఇచ్చిన క్షణాల వ్యవధిలో మంగళగిరిలో నాపై కేసు నమోదుచేశారు. నన్ను అరెస్టు చేసేందుకు అర్ధరాత్రి వేళ ఇంటిచుట్టూ 200 మంది పోలీసులను మోహరించారు. హైకోర్టు ఆదేశాలు ఉండబట్టి నేను ఇప్పుడు మీ ముందుకు రాగలిగాను. లేదంటే నన్నూ అక్రమంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు తీసుకెళ్లేవారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే జగన్‌ తాడేపల్లి కోటలో కూర్చొని ఐపీఎల్‌ మ్యాచ్‌లు, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశం నిర్వహించే ధైర్యం లేదు కానీ.. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ఎలా చెబుతారు? అమూల్‌ కోసం సంగం డెయిరీ ఆస్తులను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ మెప్పు కోసం కొందరు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు’ అని ఉమా అన్నారు.

ఇదీ చదవండి: మిశ్రమంగా సీఎం కేసీఆర్‌ కొవిడ్‌ ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.