ETV Bharat / city

పొలాల్లోనే పంటలు.. అప్పులతో అన్నదాతల ఆత్మహత్యలు

author img

By

Published : May 26, 2020, 10:13 AM IST

కరోనా.. లాక్ డౌన్​తో టమాటా రైతులు పూర్తిగా చితికిపోయారు. టమాటా సాగులో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఏపీలోని చిత్తూరు జిల్లా రైతాంగం.. సాగైనా పంటను అమ్ముకోలేక పొలాల్లోనే వదిలేస్తున్న దయనీయస్థితి నెలకొంది. అప్పులు భారం తట్టుకోలేక కొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి.. తీరా గిట్టుబాటుధర లేక ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు.

tomato farers facing problems
పొలాల్లోనే టమాటా పాతర.. అప్పుల భారంతో ఆత్మహత్యలు

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోనే అత్యధికంగా టమాటా సాగయ్యే చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలైన మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని పలువురు రైతుల దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడులకు ఏటా పఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.2.50లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధర లేక..పెట్టుబడిలో సగం కూడా రాకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి.

కరోనా.. లాక్‌డౌన్ల ప్రభావం కారణంగా బయటి మార్కెట్లకు ఎగుమతి పెద్దగా జరగడం లేదు. వినియోగం బాగా తగ్గిపోవడంతో ధరలు నేలచూపు చూస్తున్నాయి. తెచ్చిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతుండటం అప్పులు ఇచ్చిన వారినుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో మానసిక క్షోభతో నిస్సహాయ పరిస్థితుల్లో కొందరు సాగుదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

పశువుల మేతగా

ప్రస్తుతమున్న టమాటా కోసి మార్కెట్‌కు తరలిస్తే అన్నదాతలకు కూలి ఖర్చులు కూడా రాని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్‌లోని వ్యాపారులు 4 శాతం కమీషన్‌ తీసుకోవాల్సి ఉన్నా 10 శాతం తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. పలు సమస్యల నడుమ పెద్ద సంఖ్యలో రైతులు పంటను పశువులకు వదిలేస్తున్నారు. కొందరు ట్రాక్టర్లతో దున్నిస్తున్నారు.

పుంగనూరు మండలం బైరామంగళంనకు చెందిన నాగరాజు అరకొరగా నీళ్లున్నా..అయిదేళ్లగా ఏటా 10 ఎకరాలలో టమాటా సాగు చేశారు. నీటి జాడ కోసం నాలుగు బోర్లు తవ్వినా జలం జాడ అంతంతే. గత అయిదేళ్లలో పంట కాపాడుకోవడానికి రూ.12 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది పంట బాగుండటంతో సగం అప్పులు తీరిపోతాయని సంబరపడ్డారు. అనుకోని విపత్తు కరోనా రూపంలో వచ్చింది. రవాణా స్తంభించింది. ఒకవైపు అప్పులు..మరోవైపు పండిన పంట కళ్లెదుటే కుళ్లిపోవడం ఆయన్ని కలిచివేసింది. ఈ నెల 19న పురుగుల మందు తాగి తనువు చాలించారు.

19 మంది రైతులు ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో 50,000 హెక్టార్లలలో టమాటా సాగు చేస్తున్నారు. సుమారు 35 వేల మంది ఈ సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. టమాటాకు గిట్టుబాటు ధరలేక గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకూ 19 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇవీ చూడండి: మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.