ETV Bharat / city

నాటా పోటీల్లో మెరిసిన తెలుగు తేజం - news on nata

నాటా పోటీల్లో ప్రకాశం జిల్లా చీరాల యువకుడు ప్రతిభ కనబరిచాడు. కథలు, కవిత్వం, కార్టూన్ విభాగాల్లో పోటీ నిర్వహించగా సిద్ద గురునాధ్​కు మాస్క్ ధారణపై వేసిన కార్టూన్​కు బహుమతి లభించింది.

నాటా పోటీల్లో మెరిసిన తెలుగు తేజం
నాటా పోటీల్లో మెరిసిన తెలుగు తేజం
author img

By

Published : Sep 7, 2020, 11:14 AM IST

నాటా పోటీల్లో తెలుగు తేజం మెరిసింది. ప్రకాశం జిల్లా చీరాల యువకుడు పోటీల్లో సత్తా చాటాడు. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా)2020 ఆధ్వర్యంలో ఆన్​లైన్​లో నిర్వహించిన పోటీల్లో చీరాల కుర్రోడు.. సిద్దా గురునాద్ ప్రతిభ చాటాడు. చికాగో కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు నాటా కార్యవర్గం , సాహిత్యకమిటి ప్రతినిధుల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి.

కథలు, కవిత్వం, కార్టూన్ విభాగాల్లో నిర్వహించగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు పాల్గొనగా... ఒక్కో విభాగంలో అయిదుగురిని విజేతలుగా ఎంపిక చేశారు. కరోనా నేపథ్యంలో మాస్క్ ధారణపై వేసిన కార్టూన్​కు గాను సిద్ద గురునాధ్​కు బహుమతి లభించింది.. ఈసందర్భంగా ఆయన్ని పలువురు అభినందించారు. నాటా అధ్యక్షుడు గోశాల రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి పోటీలను పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:

నేడు తెదేపా ఆధ్వర్యంలో చలో ఐనంపూడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.