ETV Bharat / city

చైనా ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముఠా అరెస్టు - China online gaming gang arrested

ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిషేధమని... ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. కోట్ల రూపాయలు దండుకుంటున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ బ్యాంకుల్లోని రూ.30కోట్లను సీజ్ చేశారు.

China online gaming gang arrested in Hyderabad
చైనా ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముఠా అరెస్టు
author img

By

Published : Aug 13, 2020, 6:37 PM IST

చైనా కేంద్రంగా ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బ్యాంకు చెక్కు బుక్కులు పాస్‌పుస్తకాలు, పలు దస్త్రాలతోపాటు చరవాణులు మూడు లాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల్లోని 30కోట్ల రూపాయలను సీజ్ చేశారు. గురుగాం, దిల్లీ, ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన చైనా సంస్ధలు ఆయా కంపెనీల ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వీరిలో కొందరు చైనాకు చెందిన సిబ్బందితోపాటు స్థానికులు కూడా పనిచేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1,000కోట్లకు పైగానే ఈ సంస్ధల ద్వారా గేమింగ్ ఆడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరింత లోతైన విచారణ చేయనున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

చైనా ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముఠా అరెస్టు

ఇదీ చూడండి : తండ్రిని కొట్టి చంపిన తనయుడు.. కారణమిదే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.