lockdown in China: చైనా ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో పాక్షిక లాక్‌డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. 90 లక్షల జనాభా ఉన్న నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజలు ఇంట్లోనే ఉండి.. మూడుసార్లు పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో చాంగ్‌చున్‌లో వ్యాపారాలు మూసివేశారు. చైనాలో దేశవ్యాప్తంగా శుక్రవారం మరో 397 కేసులు నమోదవగా.. వాటిలో 98 కేసులు చాంగ్‌చున్ పరిసర ప్రాంతాల్లోనే గుర్తించారని అధికారులు వెల్లడించారు. చాంగ్‌చున్ నగరంలో ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్‌ను విధించారు. ఇతర నగరాలతో ప్రయాణాలను నిలిపివేశారు.
ఇదీ చూడండి: పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లిన భారత క్షిపణి.. అసలేమైంది?