ప్రతీ సంస్థలో ఉద్యోగికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. వాటిని రీచ్ కాలేకపోతే.. ఆయా కంపెనీ విధానాన్ని బట్టి చర్యలుంటాయి. ఇంక్రిమెంట్లలో కోత విధించడమో.. మెరిట్ పాయింట్స్ తగ్గించడమో.. లేదంటే మందలించడమో.. చేస్తారు. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కంపెనీ.. ఎక్కడా వినని డెసిషన్ తీసుకుంది. ఎంప్లాయ్ టార్గెట్ రీచ్ కాలేదంటే ఖతమే! బలవంతంగా పచ్చి కోడిగుడ్లు మింగిస్తోంది. ఈ వింత రూల్ పెట్టింది చైనాలోని ఒక కంపెనీ. "జెంగ్‌జౌ టెక్నాలజీ" అనే కంపెనీ అమలు చేస్తున్న ఈ శిక్ష గురించి.. బాహ్య ప్రపంచానికి తెలియడంతో.. సోషల్ మీడియా వేదికగా భారీస్థాయిలో రచ్చ సాగింది. ఈ రచ్చ కారణంగానే.. విషయం మన దాకా వచ్చింది. ఇప్పుడు మొత్తం సినిమా చూసేద్దాం.
ఈ కంపెనీలో ఓ యువకుడు ఇంటర్న్ షిప్ చేస్తున్నాడు. అతని పేరు బయటకు రాలేదు గానీ.. ఇంటి పేరు మాత్రమే ప్రచారంలోకి వచ్చింది. అతని సర్ నేమ్ "డు". ఇచ్చిన టైమ్ లోపు.. తగినన్ని ఆర్డర్‌లు రాబట్టకపోవడం.. విధి నిర్వహణ సరిగా లేదు అనే కారణంతో.. పచ్చి కోడి గుడ్లు మింగాలని శిక్ష విధించినట్టు అతడు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. కానీ.. తన వల్ల కాకపోవడంతో.. తాను నిరాకరించానన్నాడు. దీంతో.. తన ఇంటర్న్ షిప్ ను ముగించి ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించారని, బలవంతంగా ఇంటర్న్ షిప్ రద్దు చేయించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు.. రాజీనామా పత్రంలో "వ్యక్తిగత కారణాల వల్ల" స్వయంగా వెళ్లిపోతున్నట్టుగా రాయించుకున్నారని వాపోయాడు. ఇతని పోస్టుకు ఓ వీడియోను కూడా జతచేశాడు. అందులో సదరు కంపెనీ ఉద్యోగులు పచ్చికోడి గుడ్లు మింగుతున్న సన్నివేశాలు ఉన్నాయి. ఆ సమయంలో వారు వికారంగా ఇబ్బంది పడుతున్నారు.
ఇదంతా చూసిన నెటిజన్లు "జెంగ్‌జౌ టెక్నాలజీ" కంపెనీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ఉద్యోగుల చేత బలవంతంగా ఇలా చేయిచడం దారుణమైన చర్య అంటూ మండిపడ్డారు. ఇది పూర్తిగా అమానవీయమని, దీనికి కారకులైన వారిని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం చినికి చినికి గాలివానలా మారడంతో సదరు కంపెనీ ప్రతినిధులు స్పందించారు. కానీ.. అదంతా ఓ సాధారణ విషయంగా కొట్టి పారేయడం విశేషం. ఉద్యోగులు జాయిన్ అవుతున్నప్పుడే నిబంధనల్లో ఈ విషయం స్పష్టంగా ప్రచురించామని చెప్పడం గమనార్హం.
ఈ రచ్చతో ఎట్టకేలకు జిన్‌షుయ్ జిల్లాలోని జెంగ్‌జౌ సిటీకి చెందిన లేబర్ ఇన్‌స్పెక్షన్ బ్రిగేడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. న్యాయ నిపుణులు మాత్రం ఈ కేసు నిలబకపోవచ్చని అంటున్నారు. ఈ విషయంలో ఇంటర్న్ రద్దు చేసుకున్న "డు" యొక్క వాంగ్మూలం మాత్రమే సరిపోదని అంటున్నారు. ఎందుకంటే.. అతడు అప్పటికీ ఆ కంపెనీ ఉద్యోగి కాలేదని చెబుతున్నారు. అయితే.. "డు" మద్దుతుగా సదరు కంపెనీ ఉద్యోగి ఎవరైనా ముందుకు వస్తే మాత్రం.. పరిస్థితి మరో విధంగా ఉంటుందని అంటున్నారు.
ఈ వివాదం మరింతగా ముదురుతున్న తరుణంలో "జెంగ్‌జౌ టెక్నాలజీ" కంపెనీ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేసింది. "కంపెనీ సేల్స్ ప్రక్రియలో వచ్చే ఫలితాలకు ఉద్యోగులు బాధ్యత వహిస్తారు. ఇందులో సక్సెస్ అయిన వారికి బహుమతులు ఉంటాయి. విఫలమైన వారికి శిక్షలు కూడా ఉంటాయి. అవి స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి పద్ధతి అమల్లో లేకపోతే కంపెనీ ముందుకు సాగలేదు." అని ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ శిక్షార్హులు పచ్చి గుడ్లను తినడానికి ఇష్టపడకపోతే.. దానికి బదులుగా.. సూచించిన మొత్తంలో ఆవాలు మింగాల్సి ఉంటుందని కూడా తెలిపింది.
ఇలా.. ఈ కోడి గుడ్ల శిక్ష చైనాలో వివాదాస్పదమై బాహ్య ప్రపంచం మొత్తానికీ తెలిసింది. అయితే.. చైనా గురించి తెలిసిన వారు మాత్రం.. ఇలాంటి శిక్షలు అక్కడ కొత్తేమీ కాదని చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం.. సేల్స్ టార్గెట్ రీచ్ కాలేదని ఉద్యోగులను బొద్దింకలు తినాలని బలవంతం చేసింది ఓ కంపెనీ! మరో కంపెనీ ఏకంగా.. వీధుల్లో కొంత దూరం కాళ్లు చేతులతో నేలపై పాకించి విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ.. ఇలాంటి విచిత్ర శిక్షలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి చైనాలో!
వీటిపైనా ఓ క్లిక్కేయండి..
- అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!
- మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!
- ఫైవ్ స్టార్ హోటల్లో పందుల పెంపకం.. ఇదేందయ్యా ఇదీ..!?
- "యువరానర్.. దిసీజ్ వెరీ దారుణం.. ఈ కోడి పుంజును శిక్షించండి".. కోర్టుకెళ్లిన దంపతులు!!
- అక్కడ ఉద్యోగులు తప్పుచేస్తే.. పచ్చి కోడిగుడ్లు, బొద్దింకలు మింగాలి!!
- ఇదేం వింత సామీ.. ఆక్సిజన్ లేకుండానే బతికేస్తోంది..!!