ETV Bharat / city

'నెలాఖరులోగా ఉద్యోగుల పదోన్నతులు పూర్తి చేయాలి' - తెలంగాణ వార్తలు

కలెక్టర్లతో సీఎస్​ సోమేష్​కుమార్​ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. నెలాఖరులోగా ఉద్యోగుల పదోన్నతులు పూర్తిచేయాలని సీఎస్‌ ఆదేశించారు. ఈ నెల 24 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్‌ పేర్కొన్నారు.

నెలాఖరులోగా ఉద్యోగుల పదోన్నతులు పూర్తి చేయాలి: సీఎస్​

author img

By

Published : Jan 5, 2021, 6:47 PM IST

జిల్లా స్థాయిలోని వివిధ శాఖలు, కేటగిరీల్లో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సచివాలయం నుంచి కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన సీఎస్... ఉద్యోగుల పదోన్నతులు, డీపీసీల నిర్వహణ, కారుణ్య నియామకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్స్, డ్రైయింగ్ ఫ్లాట్​ఫామ్స్, గ్రామ నర్సరీలు, ఉపాధి హామీ పనుల పురోగతిపై చర్చించారు.

ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారని కలెక్టర్లకు సీఎస్​ తెలిపారు. కలెక్టర్లు వెంటనే జిల్లా స్ధాయిలో సమావేశం నిర్వహించి పదోన్నతుల ద్వారా నింపే ఉద్యోగ ఖాళీల సంఖ్యను అంచనా వేయాలని ఆదేశించారు. ప్రతి సోమవారం పదోన్నతులు, కారుణ్య నియామాకాలపై సమావేశాలు నిర్వహించి ఈ నెల 24 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఉపాధిహామీ ద్వారా ఈ సీజన్‌లో మూడు నెలల ముందుగానే 14 కోట్లా పది లక్షల పనిదినాలు దాటినందుకు అధికారులను అభినందించారు. రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ప్రాధాన్యత నిచ్చి పూర్తి చేయాలని సీఎస్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 50వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.