సికింద్రాబాద్‌లో కంటోన్మెంట్ నియోజక వర్గంలోని భవాని నగర్, తాడిబంద్, లక్ష్మీ నగర్, మమతా నగర్, జ్యోతి కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్ రసాయనాలు పిచికారీ చేశారు. బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్, కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు పాండు యాదవ్ ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం నియోజక వర్గ కేంద్రాల్లోని పలు ప్రాంతాల్లో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఇబ్బందులా... అయితే ఈ యాప్ మీ కోసమే.