కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు కూకట్పల్లి అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వై జంక్షన్లో సోడియం హైపోక్లోరైడ్ను చల్లారు. మొత్తం మూడు ఫైర్ స్టేషన్ల పరిధిలోని వాహనాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో, కూరగాయల మార్కెట్లు, ఫుట్‌పాత్‌లు, దుకాణాల ముందు స్ప్రే చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారావు, ఏసీపీ సురేందర్రావులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ