ETV Bharat / city

తిరుమల ఏఎస్పీపై చీటింగ్​ కేసు నమోదు

తిరుమల ఏఎస్పీపై చీటింగ్​ కేసు నమోదు
తిరుమల ఏఎస్పీపై చీటింగ్​ కేసు నమోదు
author img

By

Published : Jan 24, 2022, 9:41 PM IST

21:34 January 24

తిరుమల ఏఎస్పీపై చీటింగ్​ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా తిరుమల ఏఎస్పీపై హైదరాబాద్​లో కేసు నమోదైంది. డమ్మీ డీఎస్పీని రంగంలోకి దింపి.. ఓ వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన కేసులో హైదరాబాద్​ సెంట్రల్​ క్రైమ్​ స్టేషన్​లో ఏఎస్పీ ఎం.ముని రామయ్యపై చీటింగ్​ కేసు నమోదు చేశారు. ఈ మేరకు ముని రామయ్యకు నోటీసులు జారీ చేశారు.

అసలు ఏం జరిగిందంటే..

హైదరాబాద్​ మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్‌కుమార్‌ అనే వ్యక్తి విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. ఈయన స్నేహితుడు ముని రామయ్యను సునీల్​కుమార్​కు పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే 2018 డిసెంబర్‌లో వారిద్దరూ కలిసి సునీల్​కుమార్​ వద్దకు ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి రూ.1.2 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తారంటూ నమ్మబలికారు. అవతలి వ్యక్తి డబ్బులు ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని సునీల్‌ కుమార్‌ ప్రశ్నించగా.. ముని రామయ్య ఓ నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపాడు.

ఓ వ్యక్తిని తీసుకొచ్చి టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీగా పరిచయం చేశాడు. గతంలో తామిద్దరం కలిసి అనేక ఎన్‌కౌంటర్లు చేశామంటూ నమ్మబలికాడు. అవతలి వ్యక్తి నగదు ఇవ్వకపోతే అతడిని కనిపెట్టి, డబ్బు వసూలు చేయడం తమకు పెద్ద పనేం కాదంటూ చెప్పారు. రామయ్య మాటలు నమ్మిన సునీల్​కుమార్​ రూ.1.2 కోట్లు ఇచ్చాడు.

పక్షం రోజుల్లో వస్తాయన్న డబ్బులు.. రెండేళ్లకుపైగా ఎదురు చూసినా తిరిగి రాలేదు. దీంతో సునీల్‌కుమార్‌ ముని రామయ్యపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తన కుమార్తె పేరుతో ఉన్న ఓ స్థలం పత్రాలు ఇచ్చిన రామయ్య.. దానిపై రూ.2 కోట్ల రుణం తీసుకోవాలని తెలిపాడు. అయితే వాటిని పరిశీలించిన బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పటి నుంచి ముని రామయ్య అందుబాటులోకి రాకపోవడంతో సునీల్‌కుమార్‌ డీఎస్పీ గురించి ఆరా తీశారు. డీఎస్పీ నకిలీ అని తేలడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. సునీల్​కుమార్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.