ETV Bharat / city

తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రబాబు - రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు నిరసన వార్తలు

చంద్రబాబును హైదరాబాద్‌ పంపించేందుకు ఏపీలోని చిత్తూరు పోలీసులు చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. కొద్ది సేపటి క్రితమే తెదేపా అధినేత తిరుపతి నుంచి హైదరాబాద్​ బయలుదేరారు.

chandra babu
తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రబాబు
author img

By

Published : Mar 1, 2021, 3:46 PM IST

Updated : Mar 1, 2021, 8:17 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం నుంచి బైఠాయించి నిరసన తెలిపిన తెదేపా అధినేత చంద్రబాబు ఎట్టకేలకు హైదరాబాద్ బయలుదేరారు. స్థానిక పోలీసులు, అధికారుల విజ్ఞప్తుల అనంతరం బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు పది గంటల నిరసన తర్వాత హైదరాబాద్​కు పయనమయ్యారు.

cbn
నేలపై బైఠాయించి నిరసన తెలిపిన చంద్రబాబు

పంచాయతీ ఎన్నికల్లో అక్రమాాలు జరిగాయంటూ చిత్తూరు, తిరుపతిలో తెదేపా తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో పాాల్గొనేందుకు చంద్రబాబు.. ఈ ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. బాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు.. ఎయిర్​పోర్టులోనే ఆయన్ను నిలువరించారు. అధికారుల తీరుకు నిరసనగా బాబు.. విమానాశ్రయంలోనే నేలపై కూర్చొని నిరసన తెలిపారు.

తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రబాబు

సంబంధిత కథనాలు:

Last Updated : Mar 1, 2021, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.