ETV Bharat / city

CBN: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్‌! - ap latest news

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు.

CBN
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్‌!
author img

By

Published : Aug 19, 2021, 1:59 PM IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. అనుబంధ కమిటీల నియామకం, జిల్లాలో స్థానిక నేతల తీరుపై కొంత కాలంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో ఉన్నారు. అనుబంధ కమిటీల్లో నియామకానికి సంబంధించి ఇటీవల గోరంట్ల సిఫారసు చేసిన పేర్లకు అధిష్ఠానం ప్రాధాన్యం ఇవ్వలేదనే చర్చ ఆయన్ను మరింత కలత చెందేలా చేసిందని సమాచారం.

ఇక పార్టీలో తాను పని చేయడం అనవసరమనే అభిప్రాయాన్ని గోరంట్ల సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న అధినేత చంద్రబాబు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్‌ చేసి అసంతృప్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. స్థానికంగా ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సైతం బుచ్చయ్య చౌదరికి ఫోన్‌ చేసి మాట్లాడారు.

తెలుగుదేశం సీనియర్‌ నేత.. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పార్టీకి రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి రాజీనామా విషయంపై స్పందించేందుకు గోరంట్ల నిరాకరించారు. ఈ విషయంపై ఇప్పుడేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీ సీనియర్‌ నేతలు, ఆయన అనుచరులు గోరంట్లతో ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. ఆయనతో చర్చించిన తర్వాత మాట్లాడిన తెలుగుదేశం నాయకుడు వాసిరెడ్డి రాంబాబు.. పార్టీని వీడే ఉద్దేశం గోరంట్ల బుచ్చయ్యచౌదరికి లేదని చెప్పారు. అధినేత చంద్రబాబు సైతం బుచ్చయ్యతో మాట్లాడారని తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.