ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ అవుతుందని అప్పుడే గుర్తించామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తన ప్రభుత్వ హయాంలో.. మైక్రోసాఫ్ట్ (MICROSOFT) కంపెనీని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన విషయం గుర్తు చేశారు. న్యూజిలాండ్‌లో మహానాడు కార్యక్రమానికి వర్చువల్‌గా చంద్రబాబు హాజరయ్యారు.
'ప్రపంచంలోని ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి. ఏ రాష్ట్రమైనా సంపద సృష్టించి సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయాలి. కానీ... ఇష్టారీతిన వెళ్తూ దివాలా తీసే పరిస్థితి ఏపీలో నెలకొంది. హైదరాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు కోసం ఉత్తమ నమూనా చూశాం. ఒక్క విమానాశ్రయం కోసం ప్రపంచంలో 20 విమానాశ్రయాలు పరిశీలించాం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇవీచూడండి: Anandaiah: కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ అకాడమీకి ఆనందయ్య