ETV Bharat / city

CHANDRABABU: దేవినేనిపై హత్యాయత్నం కేసు.. చంద్రబాబు ఆగ్రహం.

author img

By

Published : Jul 28, 2021, 10:53 AM IST

ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమాపై కేసు నమోదు చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఉమాపై కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు సహా పార్టీ నేతలంతా ఖండించారు.

CHANDRABABU fires on ycp, devineni uma arrest
దేవినేని ఉమాపై హత్యాయత్నం కేసు, చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దేవినేని ఉమాపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వైకాపా నేతలను వదిలిపెట్టి.. తెలుగుదేశం పార్టీ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటని పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్టీ నేతలతో చంద్రబాబు 11 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

కేసు నమోదుకు దారి తీసిన పరిస్థితులు...

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో.. గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధరణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఇది వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య బాహాబాహీకి దారితీయటంతో.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. వాహనం ధ్వంసంతోపాటు... పలువురు గాయపడేందుకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ.. వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. కారు అద్దం పగులగొట్టిమరీ పోలీసులు ఉమాను అరెస్టు చేసి..పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి నందివాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చివరికి.. దేవినేని ఉమాపై.. అట్రాసిటీ, 307 సెక్షన్లు కింద జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని హత్యాయత్నానికి పాల్పడినట్లు.. 307 సెక్షన్‌ కింద అభియోగాలు మోపారు. ఈ విషయమై తెదేపా నేతలు ఏపీ ప్రభుత్వం తీరును, వైకాపా నేతల వైఖరిని.. చివరికి పోలీసుల వ్యవహారశైలిని సైతం తీవ్రంగా తప్పుబట్టారు. ఉమాపై కేసు నమోదు చేయడాన్ని అధినేత చంద్రబాబు సహా పార్టీ నేతలంతా ఖండించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.