ETV Bharat / city

CHANDRABABU: "నీటి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉంది" - చంద్రబాబు నాయుడు తాజా వార్తలు

రాష్ట్ర నీటి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఏపీ సీఎంపై ఉందని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న చంద్రబాబు.. పార్టీ ముఖ్య నేతలతో ఆన్​లైన్ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను ఆమోదించారు.

CHANDRABABU
CHANDRABABU
author img

By

Published : Jul 13, 2021, 6:09 AM IST

రాష్ట్ర నీటి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఏపీ సీఎం జగన్​మోహన్​రెడ్డిపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన నీటి హక్కులు, విభజన చట్టం11వ షెడ్యూల్ హక్కులు, కేంద్రం 2015లో జారీ చేసిన జీవో నెంబర్ 69, ఉభయ రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాలను ముఖ్యమంత్రి కాపాడి తీరాలన్నారు.

చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం అమరావతి చేరుకున్న చంద్రబాబు.. పార్టీ ముఖ్య నేతలతో ఆన్​లైన్​ సమావేశం నిర్వహించి, పలు తీర్మానాలను ఆమోదించారు. నదుల అనుసంధానమే అన్ని నీటి సమస్యలకు పరిష్కారమని తెలిసి కూడా.. తగు రీతిలో నిధులు ఖర్చు చేయకపోవటాన్ని చంద్రబాబు ఖండించారు. లెక్కల్లో చూపని రూ.41 వేల కోట్లపై కేంద్ర ఆర్థిక శాఖ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే నరేగా నిధులు పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు.

నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలు..

మైనింగ్ మాఫియాను వ్యతిరేకిస్తున్న గిరిజనుల్ని.. పోలీసులు బెదిరించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.ఇవాళ.. అన్ని జిల్లా కలెక్టరేట్​ల వద్ద తెదేపా శ్రేణులు బాధితులతో కలిసి నిరసనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబు నేతలకు సూచించారు. చట్ట ప్రకారం తగు అనుమతులు లేకుండా మైనింగ్​కు అనుమతులు ఇవ్వటంతో పాటు రహదారి ఏర్పాటు, మైనింగ్ మాఫియాలో పెద్దల పాత్ర రిజువైందని మండిపడ్డారు.

అన్యాయాన్ని సరిదిద్ది..

హైకోర్టు జీవో నెంబర్ 2 ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు పంచాయతీ సర్పంచులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. పంచాయతీ నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లించటాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు తక్షణమే పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అఖిలపక్ష యువత డిమాండ్లకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలకు రీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.

ఈ నెల 15, 16 తేదీల్లో ..

ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ఈ నెల 15, 16 తేదీల్లో తెదేపా పొలిట్ బ్యూరో, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు.. కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ మృతికి నేతలు సంతాపం ప్రకటించారు. సమావేశంలో నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, బండారు సత్యనారాయణమూర్తి, దూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్ర, టీడీ జనార్దన్, వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:RRR: 'పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను చేసిన తప్పేంటో చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.