ETV Bharat / city

చరిత్రలో చీకటి రోజు, పోలీసులు లేకపోతే గూండాల కథ నిమిషాల్లో తేలుస్తామన్న చంద్రబాబు - kuppam latest updates

CBN FIRES ON YSRCP ఏపీలోని కుప్పంలో వైకాపా కార్యకర్తలు సృష్టించిన విధ్వంసంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం చరిత్రలో ఆగస్టు 25 చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. కూతవేటు దూరంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ ఎదుటే దాడి జరుగుతుంటే పోలీసులకు కనపడలేదా, ఆంధ్రప్రదేశ్​లో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. పోలీసులు లేకపోతే అధికార పార్టీ గూండాల కథ 2 నిమిషాల్లో తేలుస్తామని హెచ్చరించారు.

CBN
CBN
author img

By

Published : Aug 26, 2022, 11:40 AM IST

CBN FIRES ON POLICE ‘ఆడబిడ్డలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం అన్నారు గాంధీజీ. జగన్‌ పాలనలో మగవాళ్లు మధ్యాహ్నం 12 గంటలకు కూడా బయట తిరగలేకపోతున్నారు. ఏపీలోని కుప్పంలో 82 రోజులుగా అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్న రవిచంద్రపై వైకాపా గూండాల దాడే ఇందుకు నిదర్శనం’ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కూతవేటు దూరంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ ఎదుటే దాడి జరుగుతుంటే పోలీసులకు కనపడలేదా? ఆంధ్రప్రదేశ్​లో అసలు పోలీసు వ్యవస్థ ఉందా? పోలీసులు ఉన్నది తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలను కొట్టడానికేనా? అని నిలదీశారు. మీ ఇల్లు ధ్వంసం చేస్తే, మీ కుటుంబసభ్యులను నడిరోడ్డులో అవమానిస్తే ఆ బాధ మీకు తెలుస్తుంది.. ఎన్టీఆర్‌ సాక్షిగా అన్న క్యాంటీన్‌పై దాడి చేస్తే మా కార్యకర్తలకు బాధ ఉండదా? అని ప్రశ్నించారు. కుప్పం చరిత్రలో ఇదో చీకటి రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘రవిచంద్రపై దాడి చేసిన వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాల్సింది పోయి.. వాళ్ల (వైకాపా ఎమ్మెల్సీ భరత్‌) ఇంటికి తీసుకెళ్తారా? మగాళ్లయితే.. ధైర్యముంటే వైకాపా రౌడీలు ఇప్పుడు రండి.. అధికార పార్టీ చోటామోటా నాయకులు, పుంగనూరు రౌడీ పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, తమ్ముడు, డీజీపీ, సలహాదారులు అంతా కలిసి కుప్పం రండి.. పోలీసులు కాసేపు పక్కన ఉంటే ఎంతమంది వైకాపా గూండాలు వస్తారో చూస్తా. వారి కథ రెండు నిమిషాల్లో తేలుస్తా’ అని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా రెండోరోజు గురువారం చంద్రబాబు కుప్పంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించే ముందు.. వైకాపా శ్రేణులు అక్కడున్న బ్యానర్లను చించేశారు. క్యాంటీన్‌ నిర్వహణ చూస్తున్న రవిచంద్రపై దాడి చేశారు. దీంతో చంద్రబాబు అన్న క్యాంటీన్‌ వద్దకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ప్రసంగించారు.

ఖబడ్దార్‌ జగన్‌రెడ్డీ.. ‘తెలుగుదేశం పార్టీ.. రౌడీలు, గుండాలు, తీవ్రవాదులు, ముఠా నాయకులను అణచివేసింది. నా ప్రజాజీవితంలో ఎంతో మంది నాయకులను చూశా. నీలాంటి చరిత్రహీనులను మాత్రం చూడలేదు. పోలీసు వ్యవస్థే ఉంటే ఈ రోజు అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసేవారా? మిస్టర్‌ ఎస్పీ కుప్పంలోనే ఉన్నావా? లేదా? ఉంటే నువ్వే కొట్టించావా? ఇప్పుడు నేను కావాలంటే మీ (ఎమ్మెల్సీ భరత్‌) ఇంటిని కొట్టలేనా? ఆ ఇంటిపై పడటానికి నాకు ఒక్క నిమిషం పట్టదు. ఎంతమంది పోలీసులు వస్తారు? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఖబడ్దార్‌ జగన్‌రెడ్డీ. ఈ రోజు కుప్పంలోనే కాదు. ఏపీ మొత్తం తిరుగుబాటు మొదలయింది. చట్టాన్ని అమలు చేయకపోతే పోలీసులను ప్రజల ముందు దోషులుగా నిలబెడతా. ఈ పోలీసుల్లో కొందరు కీలుబొమ్మలు. వీళ్లను ఆడించేది జగన్‌మోహన్‌రెడ్డి. న్యాయం కోసం పోరాడేవారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు’ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. తెదేపా కార్యకర్త లక్ష్మీపురం రాజు రక్తంతో తడిచిన తెదేపా జెండాను ప్రజలకు చూపుతూ.. ఈ పోలీసులది రక్తదాహం అంటూ మండిపడ్డారు.

.

ఇక్కడి నుంచే ధర్మపోరాటానికి నాంది.. ‘కుప్పం నుంచే ధర్మపోరాటానికి నాంది పలికాం. అన్నదానం చేసే వ్యక్తి కన్నతల్లితో సమానం. అటువంటి వారిని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి? స్థానిక ఎమ్మెల్యేనైన నేను రామకుప్పం మండలం కొల్లుపల్లి రాకూడదా? మా సమావేశానికి వచ్చి వైకాపా జెండాలు కట్టి రెచ్చగొడతారా? వైకాపా గుండాలు అక్రమంగా గ్రానైట్‌ క్వారీలు నిర్వహించుకుంటుంటే అక్కడికి వెళ్లి ఆపించా. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాసి బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నా. ఈ ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించరా?’ అని నిలదీశారు. ‘రాజధాని చూడటానికి వెళ్తుంటే నాపై రాళ్లు, చెప్పులతో దాడులు చేయించారు. పల్నాడుకు వెళ్తుంటే అడ్డుకున్నారు. మా ఇంటికి రౌడీలు వచ్చారు.

అప్పుడు ప్రేక్షకపాత్ర పోషించి, అధికార పార్టీకి వత్తాసు పలికిన మాజీ డీజీపీకి ఏ గతి పట్టింది? ఇప్పుడు నీకూ అదే దుస్థితి ఎదురవుతుంది. విశాఖ పర్యటనలో నన్ను నిరోధిస్తే.. న్యాయస్థానం ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా సిగ్గుతో తలదించుకున్నావు’ అని డీజీపీని ఉద్దేశించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ పోలీసుల కంటే బ్రిటిషువాళ్లు నయమని వ్యాఖ్యానించారు. ‘నన్ను కుప్పం రానివ్వరా? చంపేస్తారా? నేను మీకు భయపడాలా? మా కార్యకర్తలను కొడితే నేను మీ ఇళ్లకు వచ్చి కొడతా’ అని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఇటువంటి పరిస్థితులపై ఓ కానిస్టేబుల్‌.. ముఖ్యమంత్రిలో తప్పుందా? ప్రజల్లో తప్పుందా? రాజ్యాంగంలో పొరపాటు ఉందా? అని నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు’ అని చంద్రబాబు చెప్పారు.

  • స్వచ్ఛమైన కుప్పంలో ఈ కుళ్ళు రాజకీయాలు నిలబడవని... ఈ చర్యలకు తెలుగుదేశం శ్రేణులు ఏ మాత్రం తడబడవని వైసీపీ నేతలు తెలుసుకోవాలి. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ పై కూడా దాడి చేయాలనే ఆలోచన చేసిన రాజకీయ నేతలు మన దగ్గర అధికారంలో ఉండటం దురదృష్టకరం.(2/3)

    — N Chandrababu Naidu (@ncbn) August 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైకాపా రౌడీలు.. డీజీపీ టోపీ ఎత్తుకెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. కుప్పం నియోజకవర్గంలో వైకాపా ఫ్యాక్షన్‌ రాజకీయాలు నిలబడవని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. దాడులు, కేసులు, వేధింపులతో ప్రశాంతమైన కుప్పంలో కొత్త సంస్కృతి తెచ్చేందుకు వైకాపా ప్రభుత్వం విఫలయత్నం చేస్తోందని, దీనికి కొందరు పోలీసులు సహకరించడం దారుణమని గురువారం ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ‘పోలీసుస్టేషన్‌ పక్కనే ఉన్న అన్న క్యాంటీన్‌పై వైకాపా గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు అడ్డుకోలేదు. భవిషత్తులో వైకాపా రౌడీమూకలు డీజీపీ కార్యాలయంలోకి చొరబడి ఆయన టోపీ ఎత్తుకెళ్లినా ఆశ్చర్యం ఉండదు’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.