ఏపీలో తెదేపా కార్యాలయాలపై దాడి(attack on tdp offices)కి నిరసనగా దీక్ష చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(tdp chief chandrababu) నిర్ణయించారు. ఈరోజు ఉదయం 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8గంటల వరకు 36 గంటల పాటు ఆయన దీక్ష చేపట్టనున్నారు. మంగళవారం జరిగిన పరిణామాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెదేపా కార్యాలయంలో ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే కూర్చొని దీక్ష చేయనున్నట్లు సమాచారం.
అమిత్ షా ను కలవనున్న చంద్రబాబు..!
శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(union home minister amit shah)ను కలిసేందుకు చంద్రబాబు సమయం కోరారు. తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడులపై.. అమిత్ షాను కలిసి తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసే అవకాశముంది.
ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గవర్నర్ విశ్వభూషణ్‌కు.. చంద్రబాబు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తెదేపా కార్యాలయాలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు. వైకాపా మూకలు తెదేపా కార్యాలయాలపై దాడులకు దిగి, కార్యకర్తలను భౌతికంగా గాయపరిచాయని తెలిపారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమయ్యాయని వివరించారు. ఈ దాడులు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే చేసినవేనని తెలిపారు. దాడి ఘటనను పరిశీలిస్తామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అమిత్‌షా సూచించారని తెలిపారు. తెదేపా కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తామని హామీనిచ్చినట్లు తెదేపా వర్గాలు వెల్లడించాయి.
అష్టదిగ్బంధనం..
ఏపీ డీజీపీ కార్యాలయం(DGP office) పోలీసుల అష్టదిగ్బంధనంలో ఉంది. భారీగా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం(Tdp central office) వైపు ఎవరూ వెళ్లకుండా.. రహదారిపై ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోగా.. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసుల యత్నిస్తున్నారు. తెదేపా శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద.. పోలీసు అదనపు బలగాలు భారీగా మోహరించాయి.
దాడులు..
తెదేపా జాతీయ కార్యాలయంతో పాటు, పార్టీ నాయకుడు పట్టాభిరామ్ ఇంటిపై మంగళవారం సాయంత్రం అల్లరిమూకల దాడులు, ఏపీలో పలు చోట్ల తెదేపా కార్యాలయాలపై వైకాపా నాయకులు, కార్యకర్తల దాడి యత్నాలు, తెదేపా నాయకుల ఇళ్ల ముందు ధర్నాలతో రాష్ట్రం అట్టుడికింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై ఒక ప్రణాళిక ప్రకారం దాడులు జరగడం ప్రజల్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనలన్నీ మంగళవారం సాయంత్రం దాదాపు ఒకే సమయంలో జరిగాయి. ఈ దాడులతో తెదేపా శ్రేణులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నాయి. వైకాపా నాయకులు, పోలీసులు కుమ్మక్కై ఈ అరాచకానికి తెగబడ్డారని మండిపడుతున్నాయి. బుధవారం రాష్ట్ర బంద్‌కు తెదేపా పిలుపునిచ్చింది.
దాడులపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తెదేపా చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, కానీ ఇలా ఒక పార్టీ కార్యాలయంపై దాడులకు పాల్పడటంతో ఒక దుష్ట సంప్రదాయానికి తెర తీసినట్టయిందని వివిధ రాజకీయ పక్షాలు ఖండించాయి. తెదేపా ఆరోపణల్ని వైకాపా ఖండించింది. తెదేపా కార్యాలయాలపై తాము దాడులు చేయలేదని, ఎవరితోనో రాళ్లు వేయించడం, భౌతికంగా ఇబ్బంది పెట్టడం తమ విధానం కాదని వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: