Nandyal District Panyam school: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా పాణ్యం పట్టణంలోని ఇందిరానగర్లో మూతపడిన పాఠశాల భవనాన్ని వైసీపీ నేత ఇంటిగా మార్చేశారు. 2013లో 5.3 లక్షలతో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను నిర్మించింది. విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంతో, ఉన్న విద్యార్థులను వేరే పాఠశాలకు తరలించారు. గిరిజన పాఠశాలను ఐదేళ్ల క్రితం మూసివేశారు.
మూసిన పాఠశాలపై స్థానిక వైకాపా నేత కన్నుపడింది. శిలాఫలకం, నల్ల బోర్డు తొలగించి.. వంటగది, బెడ్ రూమ్ ఏర్పాటు చేసుకొని తన ఇంటిగా మార్చుకున్నాడు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోకపోవటంతో, తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైకాపా ప్రభుత్వం నాడు-నేడు ఇలానే ఉంటోందంటూ, వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
-
ఇదిగిదిగో... వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు! pic.twitter.com/c1Lskc3jUG
— N Chandrababu Naidu (@ncbn) September 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఇదిగిదిగో... వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు! pic.twitter.com/c1Lskc3jUG
— N Chandrababu Naidu (@ncbn) September 10, 2022ఇదిగిదిగో... వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు! pic.twitter.com/c1Lskc3jUG
— N Chandrababu Naidu (@ncbn) September 10, 2022
ఇవీ చదవండి: