ETV Bharat / city

ఎస్సీ యువకుని అరెస్ట్ వైకాపా ఉన్మాద చర్య : చంద్రబాబు

ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో ఎస్సీ యువకుడు బేతమల మణిరత్నం అరెస్ట్​ను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైకాపా ఉన్మాదం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ట్విట్టర్ లో విమర్శించారు.

chandrababu-condemns-social-media-activist-maniratnam-arrest-in-guntur-district
ఎస్సీ యువకుని అరెస్ట్ వైకాపా ఉన్మాద చర్య : చంద్రబాబు
author img

By

Published : Nov 25, 2020, 10:54 PM IST

వైకాపా ఉన్మాదం చూస్తుంటే దిగ్బ్రాంతి కలుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో ఎస్సీ యువకుడు బేతమల మణిరత్నం అరెస్ట్ మరో ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు... గోడపై పోస్టర్ ఉన్న వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టడంలో హానికరం ఏముందని ప్రశ్నించారు.

  • Shocking abuse of power by a megalomaniac YSRCP regime. Bethamala Maniratnam, a young boy from SC community was arrested in Ponnur for recording a harmless video of a poster on a wall. (1/3) pic.twitter.com/dahwLwZbyq

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) November 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అదే జిల్లాలో బాలికపై అత్యాచారం ఆరోపణలున్న నిందితులు, అరెస్ట్ చేస్తారనే భయం లేకుండా నిర్భీతిగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందన్నారు. నియంతగా మారి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:గ్రేటర్​ పోరు: పీఠమే లక్ష్యంగా బస్తీల్లో కమల ముమ్మర ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.