CBN on Polavaram: పోలవరంపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేసి.. పైసా కూడా నిరూపించలేకపోయారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలో కొనసాగుంటే.. ఈ పాటికే పోలవరం ఉరకలెత్తి పారేదని పేర్కొన్నారు.
పోలీసులు ఖబడ్దార్, చట్టాన్ని కాపాడకుండా ఉల్లంఘిస్తే గౌతం సవాంగ్ ఏమయ్యాడో ఆలోచన చేయాలని హితవు పలికారు. కార్యకర్తలకు ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా సమన్వయం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తామని వెల్లడించారు.
మదనపల్లి నియోజకవర్గానికి ఇంఛార్జ్ ఎవరు..?
చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గానికి పార్టీ ఇంచార్జిగా ఎవరిని నియమించాలనే విషయంపై.. తెదేపా సీనియర్ నేతలు సమావేశం కానున్నారు. గురువారం రాత్రి మదనపల్లి నేతలతో సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు.. నియోజకవర్గంలో ఉన్న గ్రూపులకు చెక్ పెట్టాలని.. సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డికి సూచించారు.
నియోజకవర్గంలో దమ్మలపాటి రమేష్, బోడపాటి శ్రీనివాస్ గ్రూపులుగా కార్యకర్తలు విడిపోయారు. ఇద్దరూ కలిసి పనిచేస్తే.. ఇంఛార్జ్ ఎవరికి ఇవ్వాలనేది తాను నిర్ణయిస్తానని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. రెండు గ్రూపుల మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దే పనిలో సీనియర్ నేతలు నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి:
Polavaram Visit: పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం: షెకావత్