Chandrababu Attends A Marriage : ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి తనయ వివాహ కార్యక్రమం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి.. వివాహ వేడుకకు హాజరయ్యారు. నందమూరి, నారా కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రాజకీయ, సినీరంగ ప్రముఖులు వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
హైదరాబాద్‌లో వారం క్రితం జరిగిన ఉమామహేశ్వరి కుమార్తె నిశ్చితార్థానికీ చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, అలుళ్లు, మనుమలు, మనుమరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు.
రాజకీయ విభేదాలతో దూరంగా ఉంటున్న చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు ఈ వివాహ వేడుకలో కలుసుకున్నాయి. చాలా కాలం తర్వాత.. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం దగ్గుబాటి కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు దంపతులు ఫోటోలు దిగారు.