తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కమిటీలను ప్రకటించారు. 31 మందితో తెలంగాణ తెదేపా రాష్ట్ర కమిటీ, ఆరుగురు సభ్యులతో తెలంగాణ తెదేపా సమన్యయ కమిటీ, 27 మందితో తెదేపా కేంద్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 25 మందితో తెదేపా పొలిట్‌బ్యూరోను ప్రకటించారు. తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.రమణను నియమించినట్లు చంద్రబాబు వెల్లడించారు.
ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామకమయ్యారు. ఏపీ తెదేపా పొలిట్‌బ్యూరోలోకి బాలకృష్ణ, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావ్, బొండా ఉమ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఫరూక్, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణిలను చేర్చినట్లు చంద్రబాబు ప్రకటించారు.
తెదేపా జాతీయ ఉపాధ్యక్షులుగా గల్లా అరుణకుమారి, ప్రతిభా భారతి, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, నాగేశ్వరరావు, సీహెచ్.కాశీనాథ్‌ని నియమించినట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొత్తకోట దయాకర్‌రెడ్డి, బక్కని నరసింహులు, రామ్మోహన్‌రావులను ప్రకటించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేశ్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, రవిచంద్ర యాదవ్‌లను నియమించినట్లు వెల్లడించారు.