Lokesh tweet: ఆంధ్రప్రదేశ్‌పై.. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల వీడియోను.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తమ ట్విటర్ ఖాతాకు జతచేశారు. కేటీఆర్ నోట.. జగన్ విధ్వంస పాలన మాట వచ్చిందని అన్నారు. ఒక్క ఛాన్స్ పరిస్థితి ఇలా ఉందంటూ ట్వీట్ చేశారు.
క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితిపై మిత్రులు చెప్పిన మాటలను ఆయన ప్రస్తావించారు.
‘‘పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు’’
-కేటీఆర్, తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి
-
కేటీఆర్ నోట...జగన్ విధ్వంసపాలన మాట..
— Lokesh Nara (@naralokesh) April 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
అట్టుంటది ఒక్క చాన్స్ తోని.. pic.twitter.com/qWKF5ADJLj
">కేటీఆర్ నోట...జగన్ విధ్వంసపాలన మాట..
— Lokesh Nara (@naralokesh) April 29, 2022
అట్టుంటది ఒక్క చాన్స్ తోని.. pic.twitter.com/qWKF5ADJLjకేటీఆర్ నోట...జగన్ విధ్వంసపాలన మాట..
— Lokesh Nara (@naralokesh) April 29, 2022
అట్టుంటది ఒక్క చాన్స్ తోని.. pic.twitter.com/qWKF5ADJLj
ఇదీ చదవండి: 'ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు ఏమీ లేవు.. అక్కడ ఉండలేక హైదరాబాద్ వస్తున్నారు..'