Chandrababu - daggubati Venkateswara rao: దివంగత నేత నందమూరి తారక రామారావు మనుమరాలి నిశ్చితార్థం హైదరాబాద్లో జరుగుతోంది. ఉమామహేశ్వరి కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, అలుళ్లు, మనుమలు, మనుమరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
రాజకీయ విభేదాలతో చాలా కాలం తర్వాత.. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ వేడుకలో కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం దగ్గుబాటి కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు దంపతులు ఫోటోలు దిగారు.
ఇదీ చదవండి: 'పార్టీ కోసం కోట్లు ఖర్చుపెట్టాం.. ఎమ్మెల్సీ హామీ అంటూ మర్రిని మోసం చేశారు'