ETV Bharat / city

నేరమేంటో చెప్పకుండా ఈ అరెస్టు ఏంటి...?

ఏపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు దారుణమని...అతని పట్ల అధికారులు ప్రవర్తించిన తీరు గర్హనీయమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారం ఉందన్న అహంకారంతో చేస్తోన్న ఉన్మాద చర్యలే ఇలాంటి అరెస్టులని మండిపడ్డారు. నేరం చేసి ఉంటే నోటీసులు ఇచ్చి... విచారణ చేయాల్సిన అధికారులు... పైస్థాయి ఒత్తిడి కారణంగా దుర్మార్గమైన పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

chandrababu
నేరమేంటో చెప్పకుండా ఈ అరెస్టు ఏంటి...?
author img

By

Published : Jun 12, 2020, 7:33 PM IST

నేరమేంటో చెప్పకుండా ఈ అరెస్టు ఏంటి...?

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు ముమ్మాటికి కక్షసాధింపు చర్యేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. నేరం ఏంటో చెప్పకుండా... ఒకసారైనా విచారణకు పిలవకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం ఏంటని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు ఎన్నాళ్లో సాగవని హెచ్చరించారు.

తెలుగుదేశానికి అండగా ఉందన్న కక్షతో... పార్టీ మారలేదనే ఆ కుటుంబంపై ఇలాంటి చర్యలకు తెగబడ్డారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి ఎన్ని చేసినా... 38 ఏళ్లుగా తెలుగుదేశంతో ఉన్న ఆ కుటుంబం భయపడే పరిస్థితి రాదన్నారు. ఇలాంటి బీభత్సాలతో కొన్ని వర్గాల రాజకీయ ఎదుగుదలపై ప్రభావం పడుతుందన్నారు.

ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని వందల కిలోమీటర్లు ఎలా తిప్పుతారని చంద్రబాబు ప్రశ్నించారు. కనీసం మందులు తీసుకోవడానికి... కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆక్షేపించారు. ఇంతటి దుర్మార్గ చర్యలు ఎవరి ఒత్తిడికులోనై అధికారులు తీసుకున్నారని నిలదీశారు.

ఉన్మాదుల్లా ప్రవర్తిస్తారా..?

విచారణకు పిలిస్తే అచ్చెన్నాయుడు కాదన్నాడా... నోటీసులు ఇస్తే స్పందించలేదా..అని చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఏమన్నా ఉగ్రవాదా అని నిలదీశారు. అధికారం ఉందని ఉన్మాదులుగా వ్యవహరిస్తారా అని తెదేపా అధినేత ప్రశ్నించారు. రేపు అచ్చెన్నాయుడు మీద రైడ్ జరుగుతోందని వైకాపా నేతలు నిన్నే సామాజిక మాధ్యమాల్లో ఎలా ప్రచారం చేశారన్నారు.

అవినీతిపై పోరాడటమే తప్పా...!

అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటి... పర్చేస్ మాన్యూల్​లో ఎక్కడా అచ్చెన్నాయుడు పేరు లేదని చంద్రబాబు తెలిపారు. ప్రజల కోసం అచ్చెన్నాయుడు అనునిత్యం పోరాడారని.. మద్యం, ఇసుక దోపిడీలపై రాజీలేని పోరాటం చేశారని బాబు అన్నారు. సరస్వతి సిమెంట్​కు లీజు, నీళ్లు ఇచ్చుకున్నారని అచ్చెన్నాయుడు పోరాడటం తప్పా అని బాబు ప్రశ్నించారు.

ఇవీచూడండి: అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.