ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. శాంతిపురం మండలం కడపల్లె మాజీ సర్పంచ్ కృష్ణప్పను చంద్రబాబు పరామర్శించారు. నాలుగు నెలల క్రితం కృష్ణప్ప.. ప్రమాదవశాత్తు ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నారు. కృష్ణప్ప కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటానని బాబు హామీ ఇచ్చారు.
"తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం. నన్ను మానసికంగా దెబ్బతీయాలని చూశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడే పరిస్థితి లేదు"- చంద్రబాబు
కాసేపట్లో కార్యకర్తలతో సమావేశం
కాసేపట్లో రామకుప్పంలో కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు రాజుపేట క్రాస్ నుంచి చంద్రబాబు రోడ్ షో ప్రారంభమవగా..రాజుపేట, మిట్టపల్లి మీదుగా రామకుప్పానికి ఆయన చేరుకున్నారు. ద్విచక్రవాహన ర్యాలీతో తెలుగు యువత చంద్రబాబుకు స్వాగతం పలికారు.
ఇవీచూడండి: రాజకీయాల కోసమే పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ సీటు: బండి సంజయ్