ETV Bharat / city

'అవినీతి జరిగిందని.. ఎందుకు రుజువు చేయలేకపోయారు?' - సీఎం జగన్​పై చంద్రబాబు ఆగ్రహం

ఏపీలో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో వైకాపా ప్రభుత్వం చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు రూపాయి ఖర్చు చేయలేదని ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందని.. ఎందుకు రుజువు చేయలేకపోయారని చంద్రబాబు నిలదీశారు. చేతనైతే అవినీతిని నిరూపించాలని సవాల్​ విసిరారు.

'అవినీతి జరిగిందని.. ఎందుకు రుజువు చేయలేకపోయారు?'

author img

By

Published : Dec 2, 2020, 10:22 PM IST

ఏపీలోని పోలవరంపై నీచమైన రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తప్పుడు సమాచారంతో కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అసత్యాలు ప్రచారం చేసి బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రానికి భారీ నష్టం చేశారని చంద్రబాబు విమర్శించారు. పోలవరంలో అవినీతి అన్నారు.. ఎందుకు రుజువు చేయలేదని ప్రశ్నించారు.

" పోలవరం గుత్తేదారును రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు. పోలవరంలో కొత్త గుత్తేదారును ఎందుకు తీసుకొచ్చారు. ఆర్‌అండ్ఆర్‌ ఇవ్వకుండా విద్యుత్ ప్లాంటు ఎందుకు. పోలవరంలో ఏడాదిన్నరగా మీరు చేసింది ఏమిటి. గతంలో, ఇప్పుడు మీరు చేసిన ప్రకటనల్లో ఏది నిజం. పోలవరంలో అవినీతి అన్నారు.. ఎందుకు రుజువు చేయలేదు. అవినీతి ఆరోపణలు చేసి మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు పనులెలా ఇస్తారు?" - చంద్రబాబు

'అవినీతి జరిగిందని.. ఎందుకు రుజువు చేయలేకపోయారు?'

కేసుల భయంతో కేంద్రాన్ని నిధులు అడగకుంటే చరిత్రహీనులు అవుతారని చంద్రబాబు దుబయ్యబట్టారు. పోలవరం ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో కేంద్రంతో చెప్పించాలన్నారు. వైకాపా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు రూపాయి ఖర్చు చేయలేదని చంద్రబాబు విమర్శించారు. రోడ్లకు గుంతలు పూడ్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: బోరు బావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.