ETV Bharat / city

వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. హాజరైన ప్రముఖులు

Chandanotsavam: ఏపీ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం వైభవంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టువస్త్రాలు అందచేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు స్వామివారికి తొలి చందనం సమర్పించారు.

Simhadri Appanna Chandanotsavam which is going on in glory
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
author img

By

Published : May 3, 2022, 3:35 PM IST

Chandanotsavam: ఏపీ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం వైభవంగా సాగుతోంది. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు స్వామివారికి తొలి చందనం సమర్పించారు. కుటుంబసమేతంగా అశోక్‌గజపతిరాజు అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టువస్త్రాలు అందచేశారు.

చందనోత్సవం సందర్భంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు సత్యనారాయణ చెప్పారు. సింహాచలం దేవస్థాన అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పూర్తయిందన్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, స్పీకర్ తమ్మినేని సీతారామ్ అప్పన్నను దర్శించుకున్నారు. అప్పన్న చందనోత్సవానికి తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

సింహాచల అప్పన్న స్వామిని మంత్రి గుడివాడ అమర్నాథ్ దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న తమ ఇంటి ఇలవేల్పుగా చెప్పారు. ఆ స్వామి అనుగ్రహం ఈ రాష్ట్రంపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. లైన్​లో ఉన్న చివరి భక్తుడు వరకు చక్కటి దర్శనం కల్పిస్తామని తెలిపారు.

సింహాచల అప్పన్న దర్శనం కోసం బారికేడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. క్యూలైన్​లో ఉన్న వారికి మంచినీరు, మజ్జిగ, పాలు అందించేలా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అధికారి భ్రమరాంబ, ఈవో సూర్యకళ చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు భక్తులకు నిజరూప దర్శనం చూసే అవకాశాన్ని కల్పించారు.

వైభవంగా సాగుతోన్న సింహాద్రి అప్పన్న చందనోత్సవం

ఇదీ చదవండి: తెలంగాణలో రంజాన్ సంబురం.. వెల్లివిరిసిన సామరస్యం

సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్- పాక్ సైనికులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.