Telangana weather update: రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రేపు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వివరించింది. నిన్న తూర్పు మధ్యప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు ఛత్తీస్ఘడ్ నుంచి కోస్తా తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది.
ఇవీ చదవండి: