కరోనాపై కుట్ర చేస్తోంది ఎవరో సీఎం కేసీఆర్ చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ బాగానే ఉన్నారని.. పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సచివాలయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదని అన్నారు. ఈనెల 11న సీఎల్పీ నేతృత్వంలో ఛలో సచివాలయం కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్యాకేజీ కూడా ప్రకటించలేదు. పేదలను ఆదుకోకపోగా 3 నెలల విద్యుత్ బిల్లులను ఒకేసారి వసూలు చేస్తున్నారు. పేదలపై భారం లేకుండా 3 నెలల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి. సీఎం కేసీఆర్‌కు ఏది తోస్తే అది చేయడం అలవాటైంది.
- భట్టి విక్రమార్క
ఇదీ చదవండి: చనిపోయిన వారికి కరోనా పరీక్షలు అశాస్త్రీయం: ఈటల